మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నొలకొంది. నాగబాబు కూతురు నిహారిక రేపు ‘డిసెంబర్9’ చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఈ బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరుగుతుంది. దీంతో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరందుకున్నాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తుంది. నిన్న సాయంత్రం రామ్ చరణ్, బన్నీ దంపతులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కాబోయే దంపతులతో వీరు సందడి చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు(మంగళవారం) సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయివేట్ జెట్ లో నిహారిక పెళ్లికి బయల్దేరారు. సుప్రీంహీరో సాయితేజ్ సోదరుడు ‘ఉప్పెన’ ఫేం వైష్ణవ్ తేజ్ అల్ట్రా స్మార్ట్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. బ్లూ అటైర్ లుక్ లో డ్యాషింగ్ స్టైల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ వేడుక సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.