మెగా ఫ్యామీలిలో పెళ్ళి సందడి మొదలైంది. మరో ఆరు రోజులలో మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం.. జొన్నలగడ్డ చైతన్యతో జరగనుంది. వీరి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తుంది. పెళ్లి ఏర్పాట్లు అన్నీ వరుణ్‌తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా, మరికొద్ది రోజులలో మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి హడావిడి నెలకొనడంతో అందరు ఒకే చోట చేరారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిహారిక, చైతన్యతో కలిసి శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా తదితరులు సందడి చేశారు.
డిసెంబర్ 9న నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ జరగనున్న ఈ వేడుకకి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో రిసెప్షన్ ప్లాన్ చేయగా, ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులని ఆహ్వానించనున్నారు. తాజాగా నిహారిక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram