మెగా డాటర్ నిహారిక బ్రైడల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రఖ్యాత యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై సంథింగ్ స్పెషల్ గా డిజైనర్ లుక్ లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వేషధారణలో నిహారిక మెరిసిపోతుంది. చైతన్యను పెళ్లాడేందుకు మెగా ప్రిన్సెస్ సిద్ధమవుతున్న వేళ .. ఈ మేకోవర్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
హైదరాబాద్ పంజాగుట్ట మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ ఇదని నిహారిక స్వయంగా ఇన్ స్టా లో వెల్లడించింది. నిహారికను మేకప్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. నిహారిక ఈ గెటప్ లో పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మునుపటి కంటే స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది. ఇప్పటి వరకు కనిపించనంత స్పెషల్ గా తనని తాను ఆవిష్కరించుకుంది. పెళ్లి తర్వాతా నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు.