నిహారిక కొణిదెల ప్రస్తుతం చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజంటర్‌గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈక్రమంలో ఆమె సాగు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పిల్లలు అంటే నాకు ఇష్టం.. “లైఫ్ అనేది ఒక సైకిల్. అదే సాగులో చూపించారని అంది. పిల్లలు కావాలని అంటున్నాను కాబట్టి డెఫినెట్‌గా పెళ్లి చేసుకోవాలి. దానికోసం అనే కాదండి. లవ్ మీద నాకు నెగెటివ్ ఇంప్రెషన్ అయితే లేదు” అని నిహారిక కొణిదెల చెప్పింది.
“ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదంటే.. చాలా మంది అంటారు. ఎందుకు రిలేషన్‌షిప్ ఎందుకు వర్కౌట్ కాలేదు ఒక్క కారణం చెప్పమని. ఒక్క రీజన్‌తో ఎవరు విడిపోరు. చాలా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాలేదు. అలా అని మళ్లీ లవ్ రాదు. ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం. సో ఖచ్చితంగా హోప్‌ఫుల్లీ పెళ్లి చేసుకుంటానేమో.
కానీ, త్వరలో అయితే కాదు. కానీ, పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటాను” అన్న అర్థంలో నిహారిక కొణిదెల నవ్వుతూ తెలిపింది. లవ్ మ్యారేజా.. అరెంజ్ మ్యారేజా అని చెప్పాలేను. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అయితే వర్క్‌పై దృష్టి పెట్టాను. దాని గురించి కూర్చోని అంతగా ఆలోచించలేదు అని నిహారిక కొణిదెలా క్లారిటీ ఇచ్చింది.