J
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. ఒకవైపు ఈ మెగా డాటర్ సినిమాలు చేస్తూనే, మరోవైపు డిజిటల్ రంగంలోను రాణిస్తోంది. నిహారిక ఇప్పటి వరకు తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిస్తే.. మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. పెదనాన్న చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో బోయ పిల్ల పాత్రలో మెరిసింది. ఈ సినిమాల్లో నిహారికకు గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా మొదటి సినిమా ‘ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. అది అలా ఉంటే చాలా వరకు పద్దతిగానే కనిపించే ఈమె.. ఈ మధ్య మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో కేకపెట్టించింది నిహారిక. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె మిమ్మల్ని నవ్వేంచేది ఏంటి ? క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.