HomeTelugu Trendingనిహారికకు పెళ్లి కుదిరిందా?

నిహారికకు పెళ్లి కుదిరిందా?

2 17టాలీవుడ్ లో మెగా డాటర్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా నాగబాబు కూడా నిహారిక పెళ్లి క్లారిటీ ఇచ్చేశాడు. నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తామని చెప్పాడు. తప్పకుండా వచ్చే వేసవిలో నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పడంతో వరుడు కూడా ఫిక్స్ అయ్యి ఉంటాడని అందరు అనుకుంటున్నారు. దీంతో మెగా అభిమానులంతా ఆ వార్త కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఈ టైమ్‌లో నిహారిక చేసిన ఓ పోస్ట్‌ ప్రేక్షకులను హింట్‌ ఇచ్చినట్లుగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహ’ అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. అంతేకాక మిస్టర్స్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ పెట్టింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ‘ఉహ్.. వాట్?’ అని కామెంట్ చేసింది. ఈ పోస్టును చూసిన చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం కామెంట్లు చేశారు. వై అంటూ నిహారికను ప్రశ్నించారు.

దీంతో నిహారిక పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. నిహారిక పెళ్లి ఫిక్స్‌ అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కొందరు నెటిజన్స్ అయితే ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. కొందరు మాత్రం ఇదంత కేవలం తన కొత్త సినిమా ప్రమోషన్ కోసమేనంటున్నారు. ప్రమోషన్‌లో ఇదంతా భాగమేనని కొట్టి పారేస్తున్నారు. అయితే నిహారిక క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

View this post on Instagram

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu