కరోనా కారణందా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దానితో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. సెలెబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం కావాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఏమున్నా సరే ఇంటి నుంచి చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందటంతో సోషల్ మీడియా నుంచి లైవ్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. చిట్ చాట్ చేసుకుంటున్నారు.
తాజాగా మెగా డాటర్, హీరోయిన్ నిహారిక కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. పెళ్లి తరువాత నటిస్తానా లేదా అని చెప్పడానికి తానేమి సమంతను కాదని, తనకు చాలా తక్కువ సమయం ఉందని, ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టకుండా చేస్తానని చెప్పింది. ఇకపై గ్లామర్ పాత్రలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపింది.‘నీళ్ల లోతు ఎంతుందో చూడాలంటే రెండు వేళ్లు ముంచితే సరిపోదు. మెడ వరకు దిగాల్సిందే. ఇప్పటి నుంచి నేను అదే పని చేయబోతున్నా అని తెలిపింది. చాలా తక్కువ సమయం ఉందని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియాలి. త్వరలోనే ఈ మెగా డాటర్ పెళ్లి చేసుకోబోతుందా? 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత మరో సినిమాలో నటించలేదు. కాగా ఆచార్యలో కూడా ఈమె పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బీజీగా ఉంది ఈ మెగా డాటర్.