మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం రాజస్థాన్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ బయలుదేరారు.
ఈ సందర్భంగా పెళ్లికొడుకు జొన్నలగడ్డ చైతన్య సెల్ఫీ తీశాడు. ఇందులో నాగబాబు కుటుంబసభ్యులు, పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఇక చిరంజీవి.. పవన్ కళ్యాణ్ సహా మొత్తం మెగా కుటుంబం మొత్తం హాజరు కానున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది
Udaipur ✈️ #NisChay ✨ pic.twitter.com/ztIgBbH7MI
— Niharika Konidela (@IamNiharikaK) December 7, 2020