HomeTelugu Big StoriesNiharika Konidela: విడాకులతోనే జీవితం ముగిసిపోయిన‌ట్లుగా అనుకోను: నిహారిక

Niharika Konidela: విడాకులతోనే జీవితం ముగిసిపోయిన‌ట్లుగా అనుకోను: నిహారిక

Niharika interesting commen

Niharika Konidela: మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో విడాకుల‌పై నిహారిక స్పందిస్తూ విడాకులతోనే జీవితం ముగిసిపోయిన‌ట్లుగా తాను అనుకోలేద‌ని తెలిపింది. త‌న కెరీర్‌, వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఓ యుట్యూబ్‌ ఇంట‌ర్వ్యూలో నిహారిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.

ఎదుటివారిని ఈజీగా న‌మ్మ‌కూడ‌ద‌ని పెళ్లి త‌ర్వాతే అర్థం చేసుకున్నాన‌ని చెప్పింది, అదొక అనుభ‌వ‌పాఠం. ఇప్ప‌టికీ అవ‌న్నీ గుర్తొస్తే క‌న్నీళ్లు వ‌స్తుంటాయ‌ని తెలిపింది. పెళ్లి అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మ‌నై ఘ‌ట్ట‌మ‌ం, క‌ల‌కాలం క‌లిసి ఉంటామ‌నే ఏ జంట‌నైనా పెళ్లి చేసుకుంటార‌ని నిహారిక అన్న‌ది. అంతేకానీ ఏడాదిలో విడిపోతామ‌ని అనుకొని భారీగా ఖ‌ర్చుపెట్టి ఎవ‌రూ పెళ్లిచేసుకోర‌ని తెలిపింది.

ఎలాంటి అడ్డంకులు లేకుండా త‌మ రిలేష‌న్‌షిప్ సాఫీగా సాగాల‌నే అనుకుంటారు. ఆలా ఆలోచించే ప్రేమ‌, పెళ్లి బంధాల్లోకి అడుగుపెడ‌తారు. నేను అలాగే ఆలోచించా. కానీ నేను ఊహించిన‌ట్లు జ‌ర‌గ‌లేదు. అందుకే ఆ బంధాన్ని ముగించాల్సివ‌చ్చింది అని నిహారిక తెలిపింది.

నా కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అన్న‌దే నాకు ముఖ్యం. అంతే కానీ నాకు తెలియ‌ని వారు…నాతో సంబంధం లేని ఏమ‌నుకున్నా ప‌ట్టించుకోను. గ‌త రెండేళ్ల‌లో ఫ్యామిలీ విలువ‌ను చాలా అర్థం చేసుకున్నాన‌ని నిహారిక అన్న‌ది. త‌న‌ను బ‌ర్డెన్‌గా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏ రోజు భావించ‌లేద‌ని తెలిపింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu