HomeTelugu Trendingఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: నిహారిక భర్త చైతన్య

ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: నిహారిక భర్త చైతన్య

Niharika husband Chaitanya

మెగాడాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నిహారిక 2020 లో చైతన్య జొన్నలగడ్డ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల ను తగ్గించుకుంటూ వచ్చింది. భర్తతో కలిసి కేవలం చిత్రాల ను నిర్మించింది. అలా ఈ జంట ఓ రెండేళ్ల పాటు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ ఇన్ స్టా అకౌంట్స్ లో ఇద్దరూ కలిసున్న ఫొటోలన్నీ తొలగించారు. మళ్లీ నీహారిక సినిమాల్లో నటించడం పై దృష్టి పెట్టింది. ఎక్కువుగా వెబ్ సీరీస్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా నిహారిక అన్న హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లోనూ చైతూ కనపడ లేదు. దీంతో ఫ్యాన్స్‌ అనుమానం మరింత బలపడింది.

ఇంకా చెప్పాలంటే చైతన్య బయట ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండటం మానేశాడు. చివరిసారిగా ఫిబ్రవరి 15న ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు నాలుగు నెలల ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్ర లోని ఓ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు తెలిపాడు. ఓ సుదీర్ఘ నోట్ రాసుకొచ్చాడు.

‘ఈ స్థలం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వారికి రుణపడి ఉంటాను. గత 10 రోజులు గా నా లైఫ్ లోకి వచ్చిన ఈ విపాసన యోగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియెన్స్. మనం ఓ చోటు కి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు. ప్రస్తుతం చైతన్య పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu