బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ ఎక్స్‌పోజింగ్ చేయడం, బికినీతో బీచ్‌లో తిరగడం, బాయ్ ఫ్రెండ్ర్‌తో ఫొటోలకు ఫోజులివ్వడం, ఇండస్ట్రీలో ఎంట్రీతోనే దూసుకుపోవడం మనం తరచు చూస్తునే ఉంటాం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇక్కడ పరిస్థితి పూర్తిగా విభిన్నం. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు తక్కువనే చెప్పాలి. అందుకే మన స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే ఇండస్ట్రీలో కనిపిస్తారు. అమ్మాయిలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు. ఒకవేళ వచ్చినా వారు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటారు.
కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారిందనే అనిపిస్తోంది. టాలీవుడ్‌లో కూడా ఆ కల్చర్ వచ్చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల.. మొదట్లో చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్ చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడు ఇటు సినిమాలు చేస్తూనే, అటు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేసింది ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం బాగానే అలరిస్తున్నాయి. తాజాగా హోలీ పండుగ సందర్భంగా నిహారిక ఫ్రెండ్స్‌తో హోలీ సంబరాలు చేసుకుంది. దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.