HomeTelugu Trendingపెళ్లి తరువాత నిహారిక మాట్లాడటం తగ్గించేసింది: నాగబాబు

పెళ్లి తరువాత నిహారిక మాట్లాడటం తగ్గించేసింది: నాగబాబు

Niharika decreased communic
మెగా బ్రదర్‌ నాగబాబుకు తన కూతురు నిహారికాకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. ఆమె ఇల్లు వదిలి వెళ్తుంటే పొంగుకుస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. చిన్నపిల్లాడిలా మనసారా ఏడ్వాలని ఉన్నా పెద్దరికం అడ్డొచ్చి గొంతులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కూతురి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. “సాధారణంగానే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు కూతురు పుట్టాలని చాలా కోరుకున్నాను. అలా నాకు రెండోసారి నిహారిక పుట్టింది. ఆమె నాకు బెస్ట్‌ఫ్రెండ్‌. చాలా విషయాల్లో నాకు, నా కూతురుకు ఎక్కువ కమ్యూనికేషన్‌ ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లైంది కదా! మాటలు తగ్గించేసింది. అయినా సరే నాకు సంతోషంగానే ఉంది” అని పేర్కొన్నాడు. నిహారిక తో మాటలు తగ్గినా కూడా తను ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్లినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారంటూ కూతురు అల్లుడు గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇక నాగబాబు తన కొడుకు వరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది పెద్దగా పట్టింపు లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu