బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూభాయ్ కథియావాడి’. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అలియా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలో అలియాభట్ వైట్ అండ్ వైట్ చీరకట్టులో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కనిపించే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కాగా ఇప్పుడు టాలీవుడ్ నటి నిహారిక గంగూభాయ్ కథియావాడిలా మారిపోయింది.
అదేంటి ఇది సినిమా కోసం కాదు.. గత ఆదివారం రాత్రి తన ఫ్రెండ్, యాంకర్ నిఖిల్ పుట్టినరోజు వేడుకలకు నిహారిక హాజరైంది. బర్త్ డే ఈవెంట్లో మూవీ థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే నిహారికకు గంగూభాయ్ థీమ్ వచ్చింది. తెలుపు రంగు చీరలో, నల్ల కళ్లద్దాలతో గంగూభాయ్‌ను అచ్చు గుద్దేసినట్టు తయారైంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.