మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహ నిశ్చితార్థం ఆగష్టు నెలలో హైదరాబాదులో జరిగిన విషయం విదితమే. డిసెంబర్ 9న వీరి వివాహం జరగనుంది. ఈ విషయాన్ని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు.
ఈ రోజు ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లిశుభలేఖను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లు తెలిపారు. అలాగే వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.