HomeTelugu Big Storiesవిడాకులు తీసుకోబోతున్న నిహారిక- చైతన్య?

విడాకులు తీసుకోబోతున్న నిహారిక- చైతన్య?

Niharika 1

మెగాడాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది నిహారిక కొణిదెల. పలు సినిమాల్లో నటిగా, నిర్మాతగా నటించిన ఈ అమ్మడు మూడేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా నిహారిక కొణిదెల, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మూడేళ్ల క్రితం నిహారిక- చైతన్యజొన్నలగడ్డ వివాహం.. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్లి చాలా ఘనంగా చేశాడు నాగబాబు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో వీళ్ల పెళ్లి తెగ హైలైట్ అయింది. చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతోంది. తరచూ టూర్లు వెళ్తూ పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.

Niharika and chaitanya divo

అయితే ఒక సందర్భంలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ వెంటనే వీళ్లిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుని ఆ పుకార్లకు పుల్‌స్టాప్‌ను పెట్టేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికితోడు సోషల్‌ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్‌ ఫాలో అయ్యారు. అంతేకాదు చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లిఫోటోలను డిలీట్‌ చేశారు.

నిహారికతో ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుండా డిలీట్ చేశారు. దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరి మధ్య వివాదం నెలకొందని, గ్యాప్‌ వచ్చిందనే వార్తలు ఊపందుకున్నాయి. నిహారిక, చైతన్య మధ్య వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదని తెలుస్తుంది. ఇద్దరికి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఇప్పుడు ఒకరినొకరు సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో చేసుకున్నారని అంటున్నారు.

Niharika 2

అయితే ఏ సెలబ్రిటీ పెయిర్‌ అయినా, వారిద్దరి విడిపోవడానికి ముందు చేసే పని సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో కావడం. వారి ఫోటోలను డిలీట్‌ చేయడం. ఇప్పుడు నిహారిక, చైతన్యల విషయంలో అదేజరిగింది. అయితే ఇది కేవలం చైతన్య మాత్రమే పెళ్లి ఫోటోలను, నిహారికతో ఉన్న ఫోటోలను డిలీట్‌ చేశారు. కానీ నిహారిక మాత్రం తన ఫోటోలను అలానే ఉంచింది. చైతన్యతో దిగిన ఫోటోలు, పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ వార్తలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu