HomeTelugu Trendingనేను ఎలాంటి రిలేషన్‌లో లేను..

నేను ఎలాంటి రిలేషన్‌లో లేను..

4 1

తాజాగా ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ‘భూమి’ చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులు ముగించుకుని మే 8న విడుదల కావాల్సి ఉంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన నిధి తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

‘లాక్‌డౌన్‌ వల్ల మీరందరూ ఏం చేస్తున్నారు. నేను మాత్రం ఇంట్లోనే ఉంటున్నాను’ అని పేర్కొంటూ నిధి అగర్వాల్‌ అభిమానులతో ఛాట్‌ చేశారు. కాగా ఓ అభిమాని ‘మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించగా.. ‘బెంగళూరులోని మా నివాసంలో ఉన్నాను’ అని నిధి తెలిపారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన ఫోన్‌ స్ర్కీన్‌లాక్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నేను ఏంజెల్స్‌ను నమ్ముతాను’ అని అన్నారు. అనంతరం మరో అభిమాని.. ‘మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారా?’ అని ప్రశ్నించగా.. ‘నాకు బాయ్‌ఫ్రెండ్‌ లేడు. అలాగే ఎలాంటి రిలేషన్‌లో కూడా లేను’ అని బదులిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu