బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం యానిమల్ నుంచి Satranga అనే పాటను హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు.
సిద్దార్థ్-గరిమా రాసిన ఈ పాటను శ్రేయాస్ పురానీ కంపోజిషన్‌లో పాపులర్ సింగర్ అర్జీత్ సింగ్ పాడాడు. ఆదా తేరా ఇష్క్.. ఆదా మేరా అంటూ అర్జీత్ సింగ్ మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యానిమల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హీరోహీరోయిన్లపై ఎమోషనల్‌గా సాగే ఈ పాటను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు.
తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగునున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం, డ్రామా, థ్రిల్, సంగీతం.. ఇలా ప్రతీ ఎలిమెంట్‌తో సినిమా ఫుల్ మీల్స్‌లా ఉండనుందట. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.