HomeTelugu Newsవచ్చే ఏడాది 'సారే జహాసే అచ్ఛా'

వచ్చే ఏడాది ‘సారే జహాసే అచ్ఛా’

అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రాకేష్‌ శర్మ బయోపిక్‌ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. షారుక్‌ ఖాన్‌ ఇందులో రాకేష్‌ పాత్ర పోషించనున్నట్లు చెప్పుకొచ్చారు. మహేష్‌ మత్తె ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని, భూమి పడ్నేకర్‌ కథానాయికగా నటించనున్నట్లు కూడా రాశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

15

అయితే ఈ బయోపిక్‌పై నిర్మాత రోనీ స్క్రూవాలా శనివారం స్పష్టత ఇచ్చారు. సినిమాను తెరకెక్కించబోతున్న విషయం నిజమే అన్నారు. ‘ఈ సినిమాను షారుక్‌ ఖాన్‌తో తీయబోతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమాను ప్రారంభిస్తాం. కానీ కథానాయికను ఇంకా నిర్ణయించలేదు. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సుకతగా ఉన్నాను’ అని ఆయన అన్నారు. తొలుత ఈ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్‌ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలిసింది. ఈ సినిమాకు ‘సారే జహాసే అచ్ఛా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

షారుక్‌ ప్రస్తుతం ‘జీరో’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జుగా కనిపించనున్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుష్కశర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఓ సూపర్‌స్టార్‌గా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. డిసెంబరు 21న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu