సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సినీ ఆర్టిస్ట్ సాయి సుధ తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్యామ్ కే నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు శ్యామ్ కే నాయుడు. రాజీ అయినట్లు శ్యామ్ కే నాయుడు సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయడంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే బాధితురాలు సంతకం మార్ఫింగ్ చేసి శ్యామ్ కే నాయుడు బెయిల్ పిటిషన్ వేసినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది సాయి సుధ. దొంగ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు నకిలీ పత్రాన్ని సృష్టియించాడని న్యాయస్థానంలో తెలిపింది బాధితురాలు. దీంతో శ్యామ్ కె నాయుడు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది