HomeTelugu Trendingఎన్‌కౌంటర్‌పై కొత్త ట్విస్ట్‌.. కుటుంబ సభ్యులకు అందని మృతదేహాలు

ఎన్‌కౌంటర్‌పై కొత్త ట్విస్ట్‌.. కుటుంబ సభ్యులకు అందని మృతదేహాలు

12 2
సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు పోలీసులు.. అయితే, పోస్టుమార్టం పూర్తి చేసి ఇవాళే అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు పోలీసులు… కానీ, ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించి.. ఎన్‌కౌంటర్‌పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో నిందితుల అంత్యక్రియలు నిలిచిపోయాయి.. అసలు ఎన్‌కౌంటర్ స్థలంలోనే మృతదేహాలను ఉంచాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.. కానీ, ఆ ఆదేశాలు మాత్రం పోలీసులకు సకాలంలో అందలేదు.. ఎన్‌హెచ్‌ఆర్సీ మృతదేహాలు ఇవాళ సాయంత్రం తెలంగాణ పోలీసులకు అందాయి.. అంతకంటే ముందే మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.

పోస్టుమార్టం తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలతో ఇవాళ రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆ నాలుగు మృతదేహాలను ఉంచుతారు. రేపు ఆస్పత్రికి చేరుకోనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు.. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే ఆ నాలుగు మృతదేహాలను కుటుంబ సభ్యులను అప్పగించనున్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాల తర్వాతే కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu