బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు రాహుల్.. అయితే, కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు.. దాంతో మాటామాటాపెరిగి ఘర్షణకు దారి తీయడం..
ఆ తర్వాత పరస్పరం దాడులకు దిగినట్టు తెలుస్తోంది.. అయితే, పబ్బులో రాహుల్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులుగా తేల్చారు పోలీసులు. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులను రాహుల్ సిప్లిగంజ్ వేధించారని.. దీంతో.. వారు రాహుల్‌పై బీరు బాటిళ్లతో దాడి చేశారని చెబెతున్నారు పోలీసులు. ఇక, సకాలంలో పోలీసులు స్పందించడంతో.. గొడవ పెద్దది కాకుండా ఆపగలిగారు. ఇక, గాయంతో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రాహుల్ సిప్లిగంజ్… ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయారు. తనకి ఏమీ కాలేదని. చిన్న గాయం మాత్రమే అయ్యిందంటూ ఆస్పత్రి నుంచి రాహుల్ వెళ్లిపోయారని వైద్యులు చెబుతున్నారు. అయితే, పబ్బులో జరిగిన గొడవపై సుమోటోగా కేసు నమోదు చేస్తామంటున్నారు గచ్చిబౌలి పోలీసులు.