HomeTelugu TrendingBigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!

Bigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!

New shocking twist in Bigg Boss 8 Telugu
New shocking twist in Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu elimination:

Bigg Boss 8 Telugu విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు షో నుంచి బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా వంటి కంటెస్టెంట్లు షాకింగ్‌గా బయటకు వెళ్లిపోయారు. వీరి ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓటింగ్ బట్టి జరిగింది.

తాజా సమాచారం ప్రకారం, షోలో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. అయితే ఆదివారం నాడు కాదు.. ఈ వారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ జరగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఓ సెలబ్రిటీ కంటెస్టెంట్ షో నుంచి బయటకు వెళ్లనున్నారు అని టాక్ నడుస్తోంది.

అయితే, ఈ ఎలిమినేషన్ తరువాత షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముక్కు అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, హరితేజ ఇంకా మరికొంత మంది గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు తిరిగి షోలోకి రానున్నారు అని సమాచారం.

రోజురోజుకూ షో మరింత ఆసక్తికరంగా మారుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచనున్నాయి. ఇప్పటికే నాలుగు వారాలుగా కంటెస్టెంట్ల మధ్య ఉన్న పోటీ తారస్థాయికి చేరుకుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షోలో కొత్త మలుపులు తీసుకురావడం ఖాయం. ఈ ఎంట్రీలతో హౌస్‌లో గేమ్ పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రతి వారం ప్రేక్షకులకు కొత్త ట్విస్ట్‌లు అందిస్తూ షో ముందుకు సాగుతుంది.తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు షో లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా మరొక ట్విస్ట్ రాబోతోంది.

Read More: NTR Neel సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu