ఏపీ సీఎం జగన్.. సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక సరఫరాను పెంచాలని.. లేకపోతే రేట్లు తగ్గవని సీఎం అభిప్రాయపడ్డారు. గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇప్పటి నుంచే ఇసుక నింపడం మొదలు పెట్టాలని.. అవకాశమున్న ప్రతి చోటా ఇసుక రీచ్‌లు పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇసుక రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని.. ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రీచ్‌ల్లో ఎవరూ తప్పు చేయకుండా చూడాలన్నారు. మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని జగన్ అధికారులతో వ్యాఖ్యానించారు.