ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సముద్రతీరంలో .. గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ .. చేతిలోని ఆయుధం మొదటి నుంచి హైలైట్ అవుతూ వచ్చాయి. దసరా సందర్భంగా కూడా ఆయన చేతిలోని ఆయుధంపైనే ఫోకస్ చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ పోస్టర్ అభిమానులలో మరింత ఉత్కంఠను కలిగించేలా ఉంది.
ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని వైపుల నుంచి ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.