HomeTelugu Trendingఈ వారం వాచ్‌లిస్ట్‌లో ఈ OTT releases తప్పక ఉండాల్సిందే!

ఈ వారం వాచ్‌లిస్ట్‌లో ఈ OTT releases తప్పక ఉండాల్సిందే!

New OTT Releases You Can't Miss This Weekend!
New OTT Releases You Can’t Miss This Weekend!

OTT releases this week:

ఈ వారం OTT ప్లాట్‌ఫామ్స్‌లో కొత్తగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన టైటిల్స్‌ మీ వీకెండ్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినవి ఆలస్యం చేయకుండా చూసేయండి. ఒకసారి ఆ టైటిల్స్‌ గురించి తెలుసుకుందాం.

Kadakan:

మలయాళం లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా “కడకన్” ఇప్పుడు Sun NXTలో స్ట్రీమింగ్‌ అవుతోంది. హలిం షా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. మలయాళ సినిమాల అభిమానులకు ఇది తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.

Ferry 2:

డచ్ క్రైమ్ డ్రామా “ఫెర్రీ 2” ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది. డ్రగ్ సామ్రాజ్యాన్ని కోల్పోయిన ఫెర్రీ బౌమాన్ జీవితానికి కొత్త మలుపులు ఎలా వచ్చాయన్నది ఈ సిరీస్‌ కథ. క్రైమ్ డ్రామా అభిమానుల కోసం ఇది మంచి ఎంపిక.

Pottel:

ఈ తెలుగులో వచ్చిన “పొట్టెల్” సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రగ్గడ్‌ థీమ్‌తో వచ్చిన ఈ చిత్రం స్ట్రీమింగ్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతుందా లేదా చూడాలి.

Beast Games:

అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్‌ అవుతున్న బీచ్ గేమ్స్ షోను ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలతో గేమ్స్‌ ఆడించి, కోట్ల రూపాయలు గెలవడానికి అవకాశం ఇస్తున్నారు. గతంలో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ షో ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.

ALSO READ: Amaravati Development కోసం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన భారీ లోన్ అమౌంట్ ఎంతో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu