బాలీవుడ్ నటుడు సోనూసూద్ మహాశివరాత్రి సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సోనూసూద్‌ని ట్రోల్ చేస్తున్నారు. హుదహెల్‌ఆర్‌యు సోనూసూద్ (#WhoThe Hell AreU SonuSood) హ్యాష్‌ట్యాగ్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అభిమానులతోపాటు మరికొంతమంది యూజర్లు సోనూసూద్‌కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం.
శివుడి చిత్రాలను ఫార్వార్డ్ చేయడానికి బదులుగా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మహాశివరాత్రిని జరుపుకోండి అంటూ గురువారం తెల్లవారుజామున సోనూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఆయనపై దూషణలకు దిగారు. మతవిద్వేషాన్ని ఉసిగొల్పేలా కమెంట్ చేస్తున్నారు. అయితే గత ఏడాది దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వేలాదిమందిని తమ స్వగ్రామాలకు చేరవేయడంతోపాటు, అనేకమందికి విద్యా, వైద్యం కోసం నిరంతరాయంగా సాయం చేస్తున్న దేవుడు సోనూసూద్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. నిజాయితీగల ఇండియన్ ఐడల్ అంటూ సోనూసూద్‌కు భారీ మద్దతు పలుకుతున్నారు.
ఈ ట్రోలింగ్‌కు సోనూసూద్ గతంలోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి, సాయం చేయడమే తన విధి, ‘సామాన్యుడికి’ మాత్రమే జవాబుదారీగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రోలింగ్ వెనుక నేపథ్యం, ఎవరున్నారో తనకు తెలుసు కాబట్టి, వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అంతేకాదు నెగిటివిటీ ట్రోలింగ్ చేసేవారి డీఎన్‌ఏలోనే ఉంది .. కానీ నలుగురికీ ఉపయోగపడే పనిచేసుకుంటూ పోవడమే తన పని అని సోనూసూద్ స్పష్టం చేశారు.
शिव भगवान की फोटो फॉरवर्ड करके नहीं किसी की मदद करके महाशिवरात्रि मनाएं।
ओम नमः शिवाय ।— sonu sood (@SonuSood) March 11, 2021