సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ‘అర్జున్‌రెడ్డి’ ఫీవర్ నుంచి బయటకు రమ్మంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలేమైందంటే.. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాలో విజయ్ నలుగురు అమ్మాయిల్ని ఇష్టపడిన అబ్బాయి ప్రాతలో కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 3న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో విజయ్ దేవరకొండ నటన, డైలాగులు ‘అర్జున్‌రెడ్డి’ని గుర్తుకు తెచ్చాయి.
దీంతో నెటిజన్లు విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ‘అర్జున్‌రెడ్డి’ నుంచి బయటకు రమ్మని చెబుతున్నారు. ‘ఇలాంటి చిత్రాల్లో నటించవద్దని దయచేసి విజయ్‌కు ఎవరైనా చెప్పండి’, ‘విజయ్ దేవరకొండ ఇంకా ‘అర్జున్‌రెడ్డి’ దగ్గరే ఆగిపోయినట్లు అనిపిస్తోంది’, ‘సినిమా ఒకటే కానీ వేర్వేరు సంవత్సరాలు’, ‘మేము ఇలాంటిది ఊహించలేదు’, ‘ఇతను అర్జున్‌రెడ్డి, ప్రీతికి పుట్టినవాడు అనుకుంటా’ అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.