HomeTelugu Trendingనేహా ధూపియాను ఆడుకుంటున్న నెటిజన్లు

నేహా ధూపియాను ఆడుకుంటున్న నెటిజన్లు

2 12

బాలీవుడ్ నటి నేహా ధూపియా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. బాలకృష్ణ సరసన ‘పరమవీర చక్ర ‘సినిమాలో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తాజాగా ఈ అమ్మడు హిందీలో బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘రోడీస్ రెవల్యూషన్’ ప్రోగ్రామ్‌లో నేహా టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రోగ్రామ్‌లోని ఓ కంటెస్టెంట్ తన గర్ల్ ఫ్రెండ్ తనను మోసం చేసిందని. తనతో పాటు మరో ఐదుగురితో డేటింగ్ చేసిందని, కోపంవచ్చి ఆమెను కొట్టానని చెప్పుకొచ్చాడు. అతడిపై నేహా ఓరేంజ్‌లో విరుచుకుపడింది. ‘‘నువ్వు అలా చేయడం సరైనది కాదు. అమ్మాయి అయిదుగురు అబ్బాయిలతో కలిసి ఉండటం అనేది ఆమె ఇష్టానికి సంబంధించిన విషయం’’ ఆమె ఎంతమందితో తిరిగితే నీకెందుకు..? అది ఆమె ఫ్రీడమ్ . ఎంతమందితో డేటింగ్ చేస్తే నీకెందుకు..?’ అంటూ సదరు యువకుడిపై విరుచుకుపడింది.

నేహా వ్యాఖ్యలపై మండిపడుతూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో నేహాని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆమె ‘ఫేక్‌ ఫెమినిస్ట్‌’ అని ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. ‘నేహా అదే తప్పునకు అయిదుగురు అబ్బాయిలను కొట్టినప్పుడు ఒకలా రియాక్ట్‌ అవుతారు. అదే తప్పు చేసిన ఒక అమ్మాయిని కొట్టినప్పుడు మరోలా స్పందిస్తూ.. లింగ భేదం చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక తను మాటలను అదుపులో పెట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!