బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిర్ ఖాన్ తన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఆసక్తి చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా అమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు అమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.
ఈ వ్యవహారంపై అమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను అమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.