Devara trailer:
ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఈ ట్రైలర్‌కి చాలా బాగా నచ్చేసింది. కానీ ఇంకొంతమంది మాత్రం సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో భయం, ధైర్యం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి.
దేవర ట్రైలర్‌లోని పాదఘట్టం రిఫరెన్స్ ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అయింది. ఆచార్య సినిమా సమయంలో కొరటాల శివ ఈ పాదఘట్టం అనే ఊరును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆచార్య సినిమాలో దాదాపు 30-40 సార్లు ఈ పాదఘట్టం గురించి ప్రస్తావిస్తారు.అది సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. సినిమా కూడా ఘోర పరాజయం పొందడంతో, ఈ పాదఘట్టం పేరు బీభత్సంగా ట్రోలింగ్‌కు గురైంది.
ఇప్పుడు దేవర ట్రైలర్‌లో కూడా భయం, ధైర్యం అనే పదాలు బాగా వినిపిస్తున్నాయి. ఈ పదాలను ముందుగా విడుదలైన ఫియర్ సాంగ్, టీజర్‌లో కూడా వినిపించారు. ఇప్పుడు ట్రైలర్‌లోనూ ఆ పదాలను రిపీట్ చేయడం కొంత మందిని విసిగిస్తుంది. ఆచార్య సినిమా సమయంలో పాదఘట్టం అనే పదం చాలా సార్లు వినిపించి, అది ప్రేక్షకులకి చిరాకు తెచ్చింది. ఇప్పుడు దేవర ట్రైలర్‌లో కూడా భయం, ధైర్యం పదాలు చాలా సార్లు వినిపించడం వల్ల ఆ పదాలపై వేరే అభిప్రాయాలు రావచ్చు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ మాత్రమే కాక ఇతర పాత్రలు దాదాపు 10 సార్లు ఈ పదాలను ప్రస్తావించారు.
Read More: Devara ప్రీమియర్స్ విషయంలో కూడా అదే సెంటిమెంటా?
ఈ పదాలు సినిమాలో ఎక్కువగా ఉంటే.. అది ప్రేక్షకులకు విసుగుగా మారవచ్చు. కొరటాల శివ ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ లో ఉండే దర్శకుడు. ఆచార్య సినిమా నుండి కచ్చితంగా తన లెసన్ నేర్చుకున్నారనుకోవాలి. కాబట్టి ఈసారి పదాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటారని కొందరు ఆశిస్తున్నారు.