యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘జబర్దస్త్’ షో ఈ అమ్మడు స్పెషల్ యాట్రాక్షన్. యాంకర్‌గానే కాకుండా నటిగానూ వెండితెరపై రాణిస్తున్నారు అనసూయ. తన అందం, అభినయంతో ఇటు బుల్లితెర, అటు వెండితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఫొటోషూట్లు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అభిమానించేవారు ఎంత మంది ఉన్నారో.. ద్వేషించేవాళ్లు కూడా అంతే మంది ఉన్నారు.
గురువారం ‘జబర్దస్త్’ ఎపిసోడ్‌కి కొన్ని గంటల ముందు ఆరోజు షోలో పాల్గొనే లుక్‌లో ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ క్రమంలో నేటి ‘జబర్దస్త్’ లుక్‌తో ఒక ఫొటోషూట్, కొన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పొటి డ్రెస్‌లో.. ఈ గ్రీన్ డ్రెస్‌లో టాప్ మాత్రమే ఉంది. బాటమ్ కనిపించట్లేదు.. చాలా చిన్నదిగా ఉంది. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు.
‘‘ప్యాంట్ మరిచిపోయారా?’’, ‘‘అంత యాంకరింగ్ చేస్తావ్ ఒక ప్యాంట్ కొనుక్కోవచ్చుగా’’ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ కామెంట్లు చాలా చిన్నవి.. ఇంత కన్నా దారుణమైన కామెంట్లు చాలానే ఉన్నాయి. అయితే, అనసూయను విపరీతంగా అభిమానించేవాళ్లు మాత్రం ఏం పర్వాలేదు మీరు ఇలానే దూసుకుపోండి అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. .