Gangs of Godavari: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఛల్ మోహన్ రంగ డైరెక్టర్ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిగా.. మరో కీలక పాత్రలో తెలుగు నటి అంజలి నటించింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలయ్య ముఖ్య అతిధిగా వచ్చారు . ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య స్టేజిపైకి వచ్చారు. ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి నెమ్మదిగా జరుగుతుంది.
దీనితో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకు నెడతారు. దీనితో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆ విషయాన్నీ నటి అంజలి సరదాగా తీసుకోని తరువాత నవ్వేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారడంతో నెటిజన్లు, సెలబ్రెటీలు బాలయ్య తీరుపై ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ ప్రవర్తన మహిళలను అగౌరవపరిచేదిగా ఉందని విమర్శిస్తున్నారు.
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా బాలయ్యపై విమర్శలు గుప్పించాడు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇదే ఈవెంట్‌లో బాలయ్య వాటర్ బాటిల్‌లో మందు కలుపుకోని ఈవెంట్‌కు వచ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ.. ‘బాలకృష్ణ ప్రవర్తన దారుణం. ఆ పరిస్థితుల్లో ఓ జూనియర్ నటి నవ్వుతూ ప్రతిస్పందించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత దాడి జరిగినా దాన్ని సమ్మతిస్తున్నట్లుగా అరుపులు, కేకలతో ప్రేక్షకులు స్పందించడం అత్యంత భయానకం’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ ప్రతిభగల నటితో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని పోస్ట్ చేశాడు.
ఇది ఎంతో అవమానకరం. ఆయనకు ఎంత పొగరు అంటూ మరో యూజర్ విమర్శించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ అతిగా ఊహించుకుంటూ ఓవర్ యాక్షన్ చేసే నటుడు. ఆయన ఏ సినిమాలోనూ బాగోడు అని మరో యూజర్ మండిపడ్డాడు.
’50కిపైగా సినిమాల్లో ఆమె నటించింది. అందులో దాదాపు సగం సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరం. దీన్ని ఎవరూ మార్చలేకపోవడం మరింతగా బాధిస్తోంది. ఈ వ్యవహారాన్ని తిమ్మిని బమ్మిని చేసేందుకు ‘పీఆర్’ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోను’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
అయితే ఈ ట్రోల్స్‌పై నటుడు విశ్వక్ సేన్ స్పందించారు. ఈవెంట్ లో జరిగింది వేరు సోషల్ మీడియాలో చూపించేది వేరు. దానిని ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా వుంటారు. ఆయనపై ట్రోల్స్ ఆపండి అని విశ్వక్ తెలిపారు. ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయం అది దానిని వివాదం చేయొద్దు అని నాగవంశీ తెలిపారు.