HomeTelugu Trendingఅనసూయ న్యూపిక్స్‌.. ఇప్పుడిది అవసరమా?' అంటున్న నెటిజన్లు

అనసూయ న్యూపిక్స్‌.. ఇప్పుడిది అవసరమా?’ అంటున్న నెటిజన్లు

Anasuya new pics viral

యాంకర్ అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బుల్లితెర, వెండితెర రెండు చోట్లా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్పలో ఓ కీలక పాత్రను పోషిస్తుంది. అరడజను పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల క్రేజీ సినిమాల్లో స్పెషల్ రోల్స్ లేదా స్పెషల్ నంబర్స్ చేస్తూ మరింత హీట్ పెంచేస్తున్నారు.

తాజాగా అనసూయ సమ్మర్ స్టైల్ ఫొటోషూట్ ని ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ ఫొటోలై పలువురు నెటిజన్లు మండి పడుతున్నారు. కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్‌ చేయడం అంత అవసరమా? అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం అని బదులిచ్చింది.

దీంతో ఆమెను కొంతమంది సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విబేధిస్తున్నారు. ఇక ఆమె సమాధానంతో సంతృప్తి చెందని సదరు నెటిజన్‌.. ఈ సమయంలో జనాలకు కావాల్సింది చేయూత తప్ప వినోదం కానే కాదు. ఓ పక్క వాళ్లు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ చచ్చిపోతుంటే వారిని ఇలా ఎంటర్‌టైన్‌ చేయడం కరెక్ట్‌ అని ఎలా సమర్థించుకుంటున్నావు? ఇది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు. దీంతో అనసూయ ఫ్యాన్స్‌ అతడిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి బయట పరిస్థితులు అంత దారుణంగా ఉంటే నువ్వెందుకు ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నావు? ఎవరు ఏ పోస్ట్‌ పెట్టారు? అని ఎందుకు చూస్తున్నావు, నీకు పనీపాటా లేదా? అంటూ అతడిని గట్టిగానే నిలదీశారు.

anasuya 1

https://www.instagram.com/p/CN9P9AdrN_q/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu