Bharateeyudu 2 OTT Release Date:
కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా భారతీయుడు 2. 1996లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. అయితే విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ మాత్రమే అందుకుంది.
సినిమా లవర్స్ మాత్రమే కాక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూశాక తీవ్రంగా నిరాశ చెందారు. శంకర్ ఫామ్ లోనే లేరు అని కామెంట్లు కూడా చేశారు. తమిళ్ సినిమాలో ఈ మధ్యకాలంలో విడుదలైన అతిపెద్ద డిజాస్టర్స్ లో.. ఈ సినిమా పేరు కూడా జత అయింది. సినిమా విడుదల కి ముందే డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ చిత్ర డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకుంది.
ఈ మధ్యకాలంలో సినిమాలు ఫ్లాప్ అయితే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా అనుకున్నారేటకంటే తగ్గించి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసింది. భారతీయుడు 2 విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఇప్పుడు డిజిటల్ రైట్స్ విషయంలో చర్చలు జరపాలని అనుకుంటున్నారు.
మొదట్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయిన నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవడంతో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి భారీ షాక్ ఇచ్చింది. థియేటర్లలో సినిమా డిజాస్టర్ అవడంతో అనుకున్న దాని కంటే.. సగం అమౌంట్ మాత్రమే ఇస్తామని నెట్ ఫ్లిక్స్ వారు చెబుతున్నారు.
ఒకవేళ లైకా ప్రొడక్షన్స్ దీనికి ఒప్పుకోకపోతే.. నెట్ ఫ్లిక్స్ తమ డీల్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. గతంలో కూడా ఏజెంట్ సినిమాకి అదే అయింది. ఇప్పటికీ సినిమా ఓటిటిలో విడుదల కాలేదు. మరి భారతీయుడు 2 అయినా ఓటిటి విడుదలకు నోచుకొంటుందో లేదో చూడాలి.