స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు పెళ్లి చేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ రిసార్ట్ లో స్టార్ కపుల్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నవవధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వీరి పెళ్లి వేడుకకు వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ నయన్ దంపతులతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా వీరి పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్‌ను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో నయన్-విఘ్నేశ్‌లు తమ ప్రేమకు సంబంధించిన మధుర క్షణాలను పంచుకున్నారు. వారి తమ ప్రేమ బంధం గురించి వివరిస్తుండగా మధ్యలో వారికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలతో టీజర్‌ను మలిచారు.
వీరి పెళ్లికి కోలీవుడ్‌కు సంబంధి సినీ తారలు, బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా నయన్ పెళ్లి డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు.
https://www.instagram.com/reel/ChBsRsrg797/?utm_source=ig_web_copy_link