HomeTelugu Trendingఆసక్తికరమైన తెలుగు సినిమాల కోసం Netflix భారీ డీల్!

ఆసక్తికరమైన తెలుగు సినిమాల కోసం Netflix భారీ డీల్!

Netflix Lands Rights for Much-Awaited Telugu Movies!
Netflix Lands Rights for Much-Awaited Telugu Movies!

Upcoming Telugu Movies in Netflix:

సంక్రాంతికి ఓటీటీ ప్రేమికులకు నెట్‌ఫ్లిక్స్ నుంచి స్పెషల్ ట్రీట్ రాబోతోంది. తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాల స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ప్రముఖ స్టార్ హీరోల సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సంక్రాంతి నుంచి ప్రీమియర్ అవుతున్నాయి.

ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే పాన్ ఇండియా సినిమాల హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ ‘They Call Him OG’, విజయ్ దేవరకొండ‌ ‘VD 12’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఓక రాజు’ వంటి సినిమాలు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతాయి. ఈ సినిమాల జాబితాలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ కూడా ఉన్నాయి.

Netflix లో స్ట్రీమింగ్ కు రానున్న Telugu Movies:

1. They Call Him OG (ఓజీ)

2. VD 12 (వీడీ 12)

3. HIT: The Third Case (హిట్ 3)

4. Thandel (తండేల్)

5. MAD Square (మ్యాడ్ స్క్వేర్)

6. Mass Jathara (మాస్ జాతర)

7. Jack (జ్యాక్)

8. Court: State Vs A Nobody (కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ)

9. Anaganaga Oka Raju (అనగనగా ఒక రాజు)

ఈ లిస్టులో ఉన్న ‘OG’, ‘VD 12’, ‘Mass Jathara’, ‘Court: State Vs A Nobody’ వంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రీమియర్ అవుతాయి. ‘MAD Square’, ‘అనగనగ ఓక రాజు’ మాత్రం ప్రధాన దక్షిణాది భాషల్లో విడుదల కానున్నాయి. థియేటర్ రిలీజ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

సంక్రాంతి పండుగ రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ట్రీట్ కల్పిస్తోంది. పవన్ కల్యాణ్‌ OG, HIT 3 వంటి సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్‌పై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu