బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఇది ఆయన ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. నటన, లుక్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటే కుర్రాడు నిలబడతాడు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే గణేశ్ మరో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆయన రెండో సినిమాగా ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమా రూపొందుతోంది. ‘నాంది’ సతీశ్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో రాఖి ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు.
ఈ సినిమాతో హీరోయిన్ భాగ్యశ్రీ కూతురూ.. అవంతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.