HomeTelugu Big Storiesఅంత నిడివి వర్కవుట్ అవుతుందా.. తేజ?

అంత నిడివి వర్కవుట్ అవుతుందా.. తేజ?

ఒకప్పుడు తెలుగు సినిమాల నిడివి కనీసం రెండున్నర గంటలు ఉండేవి. కొన్ని సినిమాలైతే మూడు గంటల నిడివితో కూడా ఉండేవి. కానీ రాను రాను ఈ పరిస్థితి మారింది. సినిమా నిడివి ఎక్కువ ఉంటే బాగా సాగదీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకనిర్మాతలు కూడా సినిమాను వీలైనంత క్రిస్పీగా ఉండేలా చూసుకుంటున్నారు. రెండు గంటల నుండి రెండు గంటల పదిహేను నిమిషాలలోపే సినిమా ఉండేలా ఎడిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు తేజ పెద్ద సాహసం చేస్తున్నాడనే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నిడివి రెండు గంటల 40 నిమిషాలట.
ఈ విషయాన్ని స్వయంగా రానానే వెల్లడించారు. తేజ ఒక పెద్ద కథ చెప్పబోతున్నాడు. ఆ విషయంలో అసలు రాజీ పడలేదు. ఈ కథకు న్యాయం చేయాలంటే ఆ నిడివి తప్పకుండా ఉండాల్సిందే అంటూ రానా వెల్లడించారు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉన్నా.. కథ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని అన్నారు. హీరోగా నేను నిర్మాతగా సురేష్ బాబు గారు ఈ సినిమా విషయంలో చాలా సంతృప్తి చెందామని అన్నారు. ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రబృందం ఇంత నమ్మకంగా ఉన్నా.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో.. చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu