Homeతెలుగు Newsనెల్లూరు జిల్లాలో వైసీపీ జడ్పీ ఛైర్మన్‌ రాజీనామ

నెల్లూరు జిల్లాలో వైసీపీ జడ్పీ ఛైర్మన్‌ రాజీనామ

5 23
వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరి వల్లే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొమ్మిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలి.. అంత డబ్బు నువ్వు పెట్టగలవా? అని జగన్‌ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu