క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా షార్ట్ ఫిల్మ్ ‘నీవేనా.. నీవేనా’. రవి కశ్యప్ ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. హీరో తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో అతడు పడే వేదన యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. తన తండ్రి ప్రేమను దూరంచేసుకోవడం ఇష్టం లేని హీరోయిన్ తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది. తనను మర్చిపోవాలని హీరోకి చెబుతుంది. తన తండ్రి చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. పెళ్లి కుదిరిన ఆ అమ్మాయి శుభలేఖలు పంచడం కోసం హీరో సహయం కోరుతుంది. అయితే తన తండ్రి పడే బాధ గురించి ఆలోచిస్తుందే గానీ తన ఆవేదనను అర్థంచేసుకోవడం లేదని హీరో బాధపడుతుంటాడు. అప్పుడే కథలో ట్విస్ట్. శుభలేఖలో పెళ్లి కుమారుడి పేరు చూసి హీరో షాక్ అవుతాడు. ఇంతకీ అతడు ఎవరు? తన తండ్రి ఎవరిని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. హీరోయిన్ ఎవరిని పెళ్లిచేసుకుంది. చివరికి ఏమైంది.. మిగతా కథ ఈ షార్ట్ ఫిలింలో చూసేద్దాం.