మురళి, శివానీ నాయుడు జంటగా నటించిన చిత్రం ‘నీ చిత్రం చూసి’. మహీంద్రా బషీర్ డైరెక్షన్‌లో… మురళీ మోహన్.కె నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందమైన ప్రేమకథా చిత్రమిది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేసిన మా చిత్రం టీజర్‌కి, ఏపీ మాజీ మంత్రి గడ్డం వినోద్ వెంకటస్వామి ఆవిష్కరించిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని దర్శక-నిర్మాతలు అన్నారు.