HomeTelugu TrendingChandrababu Naidu Oath Ceremony: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి.. ఎవరంటే?

Chandrababu Naidu Oath Ceremony: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి.. ఎవరంటే?

Chandrababu Naidu Oath Ceremony: Who is the girl who was the center of attraction?
Chandrababu Naidu Oath Ceremony: Who is the girl who was the center of attraction?

Chandrababu Naidu Oath Ceremony Highlights: సోషల్ మీడియా వచ్చిన దగ్గరనుంచి.. సెలబ్రిటీస్ కావాలంటే సినిమాలు చేయనవసరం లేదు.. కేవలం ఒక ఫోటో లేదా వీడియో రిలీజ్ చేస్తే చాలు.. హీరో హీరోయిన్ల కన్నా ఎక్కువ పాపులర్ అయిపోతున్నారు ఎంతోమంది. ఇక ఈ మధ్య అలానేసోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యింది పులివర్తి నాని కోడలు త్రిష రెడ్డి.

 

View this post on Instagram

 

A post shared by Memes Garage (@_memes__garage__)

తన మామకు ఓట్ వెయ్యమంటూ.. త్రిష కొద్ది రోజుల కిందట వీడియో విడుదల చేసింది. ఇక ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అయింది. ఆమెకు హీరోయిన్ కన్నా ఎక్కువ అభిమానులు ఏర్పడ్డారు.  ఇక ఈరోజు జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. డాక్టర్ పులివర్తి త్రిషా రెడ్డి. ఇక త్రిష ఎవరు అనే విషయానికి వస్తే..తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు పులివర్తి నాని..కోడలు ఈ త్రిషా. తన అత్త, మామ, భర్తతో కలిసి త్రిషారెడ్డి.. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార.. కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక వీరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన చోట కూర్చున్నారు.

Chandrababu Naidu Oath Ceremony 

కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన.. సుధారెడ్డిని ఎన్నో సంవత్సరాల క్రితమే.. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ జనరేషన్ కి కూడా అదే తరహా.. ఫాలో అవుతూ.. నాని కుమారుడు కూడా.. రెడ్డి సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ త్రిషా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మొన్న జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో నానిని గెలిపించాలంటూ.. త్రిషారెడ్డి ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసిన ఓ వీడియో.. అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

దాంతో ఈరోజు ప్రమాణస్వీకారం కి వచ్చిన త్రిష రెడ్డి పై మీడియా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. కాగా ఆమె ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu