HomeTelugu Newsసుశాంత్‌ మాజీ మేనేజర్‌ అరెస్ట్‌..

సుశాంత్‌ మాజీ మేనేజర్‌ అరెస్ట్‌..

NCB arrests sushant singh e
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్‌ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్‌ అధికారులకు తెలిపాడు. ఇక ఈ కేసులో వచ్చిన మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్‌ల పర్వం ప్రారంభమయ్యింది. శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాను అరెస్ట్‌ చేశారు. అతడితో పాటు డ్రగ్‌ డీలర్లు జైద్‌ విలాత్ర, బిసిత్‌ పరిహార్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌సీబీ అధికారులు షోవిక్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎన్‌సీబీ అధికారులు షోవిక్‌తో పాటు శ్యాముల్‌ మిరాండాల ఇంటిలో ఓకే టైమ్‌లో సోదాలు చేశారు.

ఇక ఇప్పటికే డ్రగ్‌ డీలర్‌ అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్‌ పరిహార్‌ను దర్యాప్తులో చేర్చిన సంగతి తెలిసిందే. బాసిత్, జైద్ ఇద్దరూ డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పాల్గొన్నట్లు చెప్పారు. శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ ఇంటిలో హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్‌ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్‌ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్‌ విలాత్రాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్‌ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu