NBK109 Update:
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈమధ్య వరుస సూపర్ హిట్లతో కెరియర్లో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో.. మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వాల్తేరు వీరయ్య తో మెగాస్టార్ చిరంజీవి కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబి ఇప్పుడు బాలయ్య కి కూడా బ్లాక్ బస్టర్ ఇస్తారని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల గురించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇంతకుముందు ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. మళ్లీ వీళ్ళిద్దరి హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈసారి కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వర్క్ అవుట్ అవుతుందని అనుకోవచ్చు.
మరోవైపు ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చిత్ర బృందం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ను రంగంలోకి దింపారు. బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.
నిజానికి ఊర్వశీ రౌతేలా ను వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది డైరెక్టర్ బాబి నే. ఆ తర్వాత ఏజెంట్, స్కంద, బ్రో వంటి సినిమాల్లో కూడా ఐటమ్ హీరోయిన్ గా కనిపించిన ఈమెను ఇప్పుడు నటిగా కూడా బాబీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు.
ఈ సినిమాలో ఊర్వశీ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా అందాలతో అందరినీ ఆకట్టుకున్న ఊర్వశి ఇప్పుడు నటనతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి. బాలయ్య కూడా ఈ సినిమాలో ఒక బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.