నేడు దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ 107వ సినిమా ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్ నెస్ తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘అఖండ’ హిట్ తరువాత బాలయ్య .. ‘ క్రాక్’ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
‘బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. ఇప్పటి వరకు 40శాతం షూటింగ్ పూర్తయింది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త లుక్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
#NBK107 🔥🔥 pic.twitter.com/lTR9poxqfi
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022