HomeTelugu Trendingమంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి: నయనతార

మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి: నయనతార

Nayantharas Instagram post

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో నయనతార యాక్షన్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వచ్చిన ఈ సినిమాని గౌరీ ఖాన్‌ నిర్మించింది.

అట్లీ డైరెక్షన్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. షారుఖ్‌ గత రికార్డులను కూడా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్‌ చేసేసింది. ప్రస్తుతం జవాన్‌ సక్సెస్‌ను నయన్‌ ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. భర్త విఘ్నేశ్‌ శివన్‌ వేసుకున్న టీ షర్ట్‌పై ‘మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..’ అని రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu