HomeTelugu Big Storiesనయన్‌- విఘ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో.. వైరల్‌

నయన్‌- విఘ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో.. వైరల్‌

Nayanthara vignesh shivan w

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార-విఘ్నేష్​ శివన్​ వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే వారిద్దరు.. జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు.

తాజాగా ఈ నయన్​-విఘ్నేష్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్​ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్​లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ​ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్​లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

https://www.instagram.com/tv/Ceh2asZAfLO/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu