స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విష్నేుశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలలో వీరి విహహం వచ్చే నెల 9న జరగనుందని మెున్నటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా పెళ్లి వేదిక మారినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్లు టాక్. పెళ్లికి ఆహ్వానిస్తూ.. నయన్-విఘ్నేశ్ ఇప్పటికే తమ స్నేహితులదరికీ ఓ వీడియో ఇన్విటేషన్ పంపించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ప్రకారం వీరి వివాహం జూన్ 9న మహాబలిపురంలోని మహబ్హోటల్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.
నానుమ్ రౌడీ తాన్ సినిమాతో విఘ్నేష్ తో ప్రేమలో పడింది నయన్. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విఘ్నేష్ శివన్ డైరెక్షన్లోనే విజయ్ సేతుపతి, సమంతతో కలిసి కణ్మణి రాంబో ‘ఖతీజా’ సినిమాలో నటించింది నయన తార.