లేడీ సూపర్‌స్టార్ నయనతారకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది పాన్ ఇండియా ప్రాజెక్ట్ జవాన్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఉమెన్ ఫ్యాషన్ మ్యాగజైన్ Elle India కవర్ పేజీపై తళుక్కున మెరిసింది.
Elle India కవర్ పేజ్‌పై ఒకే ఒక్క లేడీ సూపర్‌స్టార్ నయనతార అంటూ మ్యాగజైన్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. తెలుపు రంగు షర్ట్, బ్లాక్ కోటు మ్యాచింగ్ బూట్లతో హొయలుపోతూ.. కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ELLE Indiaతో నయనతార తొలిసారి చేసిన సోలో కవర్ షూట్ చాలా గొప్పది.
నయనతార చెన్నైలోని ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ స్టూడియో స్పేస్‌లో చక్కర్లు కొట్టింది. ఆమె గమ్యం.. వివేకవంతమైన అభిరుచికి ప్రతిబింబించే ఫ్యాషన్ ర్యాక్..అంటూ ట్వీట్ చేసింది. నయనతార తాజా కవర్ పేజీ ఫొటోలు, వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.
#ELLEDigitalCoverStar: @NayantharaU ‘s journey as an actress has been marked by an ever-expanding aura of stardom, a phenomenon that has been apparent from her very inception in the industry. pic.twitter.com/zSLZX9tX7o
— ELLE India (@ELLEINDIA) October 11, 2023