Nayanthara Instagram: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అటు తెలుగులో మాత్రమే కాక ఇటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు పోతోంది. నయనతార ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో దాదాపు ఏడేళ్ళు ప్రేమలో ఉండి 2022లో పెళ్లి చేసుకుంది. చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్లయిన కొద్ది నెలలకే సరోగసి ద్వారా ఇద్దరూ మగ పిల్లలకు జన్మనిచ్చింది.
ఉయిర్, ఉలగ్ అంటూ పిల్లలకి పేర్లు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన భర్త, పిల్లల ఫోటోలు కూడా షేర్ చేసే నయనతార తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ శివన్ కోసం ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
“ఈ ప్రపంచంలోనే బెస్ట్ నాన్న కి హ్యాపీ ఫాదర్స్ డే. మా ప్రపంచం మొత్తం నీ చుట్టూనే తిరుగుతుంది. నువ్వే మాకు అన్నీ. నువ్వు మా మీద చూపించే ప్రేమ, మా కోసం నువ్వు చేసే పనులే మా ప్రపంచం. నీ వాళ్ళం అయినందుకు మేము చాలా అదృష్టవంతులం. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం నాన్న. ఇట్లు ఉయిర్, ఉలగ్” అంటూ నయనతార తన పిల్లలకి బదులుగా విఘ్నేష్ కు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేష్ పిల్లలతో ఆడుకుంటున్న విజువల్స్ లో ఒక అదిరిపోయే వీడియో కూడా షేర్ చేసింది.
https://www.instagram.com/reel/C8Q9WD8vXhb/?igsh=bnd3c3MyeGZ6cTJr
నయనతార పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒక నెల క్రితమే నయనతార తన భర్త, పిల్లలతో కలిసి ఫారిన్ టూర్ కి కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి నయన్ పెట్టిన ఫోటోలు కూడా అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించాయి.
Nayanthara Upcoming Movies:
ఇక సినిమాల పరంగా చూస్తే నయనతార ఈ మధ్యనే జవాన్, అన్నపురాని సినిమాలలో కనిపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ గా నయనతార పేరే చెప్పుకోవచ్చు. నయనతార చేతిలో ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సినిమాలు ఉన్నాయి.
అయితే అన్నీ తమిళ మలయాళం సినిమాలే కానీ తెలుగు సినిమాలు లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. తమిళ్ లో తాని ఒరువన్ 2, అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార మలయాళంలో మమ్ముట్టి తో కూడా ఒక సినిమా చేస్తోంది. చాలా కాలం తర్వాత ఒక కన్నడ సినిమా కూడా చేస్తుంది ఈ భామ.